రైతులు, మహిళలకు రేవంత్‌రెడ్డి ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్దానాలే : నిజామాబాద్‌ ఎంపీ

-

రైతులు, మహిళలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇచ్చినవన్నీ మోసపూరిత వాగ్దానాలేనని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బెదిరించడం, సాయంత్రానికి పైసల్‌ వసూలు చేసి సెటిల్‌మెంట్లు చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

కోరుట్లలో ధర్మపురి అర్వింద్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి తీసుకోవడం ద్వారా బీజేపీకి దారులు తెరుస్తున్నారని అన్నారు .రాబోయే రోజుల్లో తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన ఆశా భావం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీలోకి వస్తానంటే స్వాగతిస్తామని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

బాధ్యతారహితమైన కాంగ్రెస్‌ పాలనలో మౌలిక వసతులు, తాగు, సాగునీరు, కరెంట్‌ కష్టాలు ఎదురవుతున్నాయని ధర్మపురి అర్వింద్‌ మండిపడ్డారు . కాంగ్రెస్‌ 2018 డిసెంబర్‌ ముందు తీసుకున్న రైతులకే రుణమాఫీ చేస్తామని చెప్పిందని, అంటే అంతకుముందు రైతులకు రుణాలు లేవా..? రైతులు వ్యవసాయం చేయలేదా..? అని ధర్మపురి అరవింద్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news