పోషకాలకు నిలయం… సీతాఫలం.. తిన్నారంటే మైమరిచిపోవాల్సిందే..!

-

సీతాఫలం.. ఇదే సీజన్.. చలికాలం. ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా సీతాఫలాలే కనిపిస్తాయి. బుట్టల్లో రోడ్డు పక్కన పెట్టి అమ్ముతుంటారు. ఊళ్ల నుంచి వాటిని తీసుకొచ్చి సిటీల్లో ఎక్కువగా అమ్ముతుంటారు. దోరగా పండిన సీతాఫలాన్ని చూస్తే మాత్రం ఆపుకోలేము. వెంటనే బండి ఆపి పోయి దోరగా పండిన సీతాఫలాన్ని తిని మధురమైన అనుభూతి అనుభవిస్తేనే తెలుస్తుంది. సీతాఫలం ఎంతో మధురంగా ఉండటం మాత్రమే కాదు.. దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే సీతాఫలం తింటే అటు పోషకాలు అందుతాయి.. ఇటు రుచిగానూ ఉంటుంది. మరి.. ఈ సీజనల్ ఫ్రూట్ లో ఉండే పోషకాలేంటి.. దీని వల్ల మనకు ఏం లాభమో తెలుసుకుందామా..

సీతాఫలంలో అస్సలు కొవ్వు ఉండదు. సాధారణ సైజులో ఉన్న ఒక సీతాఫలాన్ని తింటే దాదాపు 200 కేలరీల వరకు శక్తి వస్తుంది. ఒక పండులో 4 శాతం ఐరన్, 2 శాతం కాల్షియం, విటమిన్ సీ 50 శాతం, కార్బొహైడ్రేట్లు 48 గ్రాములు, ఫైబర్ 6 గ్రాములు అందుతాయి. అంటే ఇన్ స్టాంట్ ఎనర్జీలాగా అన్నమాట. ఎప్పుడైనా నీరసంగా ఉన్నా… శక్తి నశించినా.. వెంటనే ఓ సీతాఫలం పండు తింటే చాలు. శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.

గుండె సంబంధ వ్యాధులతో బాధపడేవాళ్లు సీతాఫలాలు తింటే చాలా మంచిది. అది గుండె కొట్టుకునే తీరును క్రమబద్ధీకరణ చేస్తుంది.

చర్మవ్యాధులు ఉన్నవాళ్లు ఈ పండును తరుచుగా తింటే మంచిది. ఎదిగే పిల్లలకు ఈ పండును తినిపిస్తే చాలా మంచింది. పిల్లల ఎముకల అభివృద్ధికి ఇది ఎంతో తోడ్పడుతుంది.

అల్సర్ తో బాధపడేవారు ఈ పండు తీసుకుంటే చాలా బెటర్. అల్సర్ కు సీతాఫలం మంచి మందు. పేగులలో ఉండే హెల్మింత్స్ అనే నులిపురుగలను నివారించడంలోనూ సీతాఫలం తోడ్పడుతుంది.

తలనొప్పికి బ్రహ్మాండమైన ఔషధం సీతాఫలం. వాంతులు లాంటివి వచ్చినప్పుడు కూడా సీతాఫలం తింటే వాంతులు ఆగిపోతాయి.

వెంట్రుకలు గట్టిగా ఉండటానికి… చుండ్రును దూరం చేసుకోవడానికి… వెంట్రుకలు నల్లగా ఉండటానికి కూడా సీతాఫలం సహకరిస్తుంది.

గర్భిణీలు ఈ పండును తీసుకుంటే వాళ్లకు ఎన్నో లాభాలు ఉంటాయి. గర్భంలోని శిశువు జుట్టు, చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఇది దోహదపడుతుంది. డెలివరీ తర్వాత తల్లులకు తొందరగా పాలు రావాలంటే ఈ పండు తీసుకుంటే బెటర్.

తరుచుగా సీతాఫలాన్ని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా మారుతాయి. బలహీనతను దూరం చేస్తుంది.

అయితే.. మధుమోహం, కిడ్నీ, లివర్, ఆస్తమా లాంటి సమస్యలతో బాధపడేవారు మాత్రం సీతాఫలాన్ని తినకపోవడమే మంచింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version