MAA Elections 2021 : తెలంగాణ వాదంతో “మా” బరిలో మరో నటుడు

-

తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నికల హడావుడి మామూలుగా లేదు. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. అయితే.. ఈసారి మా అధ్యక్ష ప‌ద‌వికి విల‌క్షణ న‌టుడు ప్రకాష్ రాజ్.. యువ‌హీరో మంచు విష్ణు.. సీనియ‌ర్ న‌టీమ‌ణి జీవిత రాజ‌శేఖ‌ర్.. సీనియ‌ర్ స‌హాయ న‌టి హేమ పోటీలో నిల‌వ‌గా.. ఇప్పుడు ఐదో పోటీదారుగా ప్రముఖ నటుడు, న్యాయవాది సి.వి.ఎల్. నరసింహారావు పేరు ఖ‌రారైంది.

ఈ మేరకు సి.వి.ఎల్. నరసింహారావు కీలక ప్రకటన చేశారు. పరిశ్రమలో మొదటి నుంచి తెలంగాణ వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన చెందిన ఆయన… ఆ కష్టాలను రూపుమాపడానికి తాను బరిలో ఉంటున్నానని పేర్కొన్నారు. ఇక తన నినాదం.. తెలంగాణ నినాదమని వారికి అన్యాయం జరుగకుండా ఉండాలనే పోటీలో దిగుతున్నట్లు స్పష్టం చేశారు సీవీఎల్ నరసింహారావు. త్వరలోనే తన ప్యానల్ ను ప్రకటిస్తానని పేర్కొన్నారు సి.వి.ఎల్. నరసింహారావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version