షర్మిల కేసు: ఆ వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లకు నోటీసులు

-

సోషల్ మీడియాలో, వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌లో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ చెల్లెలు షర్మిలపై చేస్తున్న అసత్య ప్రచారంపై ఆమె ఇవాళ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్ మీడియాతో పాటు… వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానెళ్లలో షర్మిలపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. యూట్యూబ్‌లో షర్మిలపై ప్రచారం చేస్తున్న 60 వీడియోలను సేకరించారు. వాటిని అప్‌లోడ్ చేసిన యూట్యూబ్ చానెళ్లపై పోలీసులు చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ఈ కేసుతో సంబంధమున్న 15 మందిని గుర్తించిన పోలీసులు.. వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్లను ప్రశ్నించి నోటీసులు జారీ చేశారు. మిగితా 10 మందిని కూడా పోలీసులు త్వరలోనే అదుపులోకి తీసుకోనున్నారు.

వెబ్‌సైట్లలో, యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్లే కాదు.. వాటిని తయారు చేసిన వాళ్లు, వాటికి కామెంట్లు పెట్టిన వాళ్లను కూడా నిందితులుగా చేర్చనున్నట్టు పోలీసులు తెలిపారు. దీని కోసం సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలను సైబర్ క్రైమ్ పోలీసులు కాంటాక్ట్ కానున్నారు. ఇప్పటికే ఐపీ అడ్రస్ ద్వారా కొంతమంది లాగిన్ వివరాలను పోలీసులు సేకరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version