సాయి ధరమ్ తేజ్ కు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు !

-

టాలీవుడ్‌ హీరో సాయి ధరమ్‌ తేజ్‌.. ఇటీవలే రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. మొన్నటి వినాయక చవితి పండుగ రోజునే… కేబుల్‌ బ్రిడ్జి దగ్గర ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే.. తాజాగా సైబరాబాద్ పోలీసులు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యాక్సిడెంట్‌ కేసులో.. సాయి ధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేశామని తెలిపారు.

సాయి ధరమ్ తేజ్ రోడ్ ప్రమాదం పై ప్రస్తుతం విచారణ చేస్తున్నామని చెప్పారు పోలీసులు. త్వరలోనే ఈ కేసుపై ఛార్జ్ షీట్ వేస్తామని ప్రకటన చేశారు. దాదాపు 45 రోజుల పాటు హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ఆస్పత్రి లోనే చికిత్స పొందాడని.. ఈ ప్రమాదం పై సాయి ధరమ్ తేజ్ కు నోటీసులు జారీ చేశామన్నారు. అయితే.. ఆ నోటీసులపై అతడి నుండి ఇంకా రిప్లై రాలేదని పేర్కొన్నారు. త్వరలోనే సాయి ధరమ్‌ తేజ్‌ నుంచి రిప్లై వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు పోలీసులు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version