సైకిల్ డే… చంద్రబాబు ఆసక్తికర పోస్టు

-

నేటి కాలంలో బైకులు, కార్లు ఎక్కువైపోయి సైకల్ వాడకం చాలా వరకు తగ్గిపోయింది.ఇంటి నుంచి వంద మీటర్ల దూరం వెళ్లాలన్న అందరూ బైకులనే వాడుతున్నారు. ఈ క్రమంలోనే అనేక అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అయితే, ఇవాళ ప్రపంచ సైకిల్ డే సందర్భంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘సైకిల్ తొక్కే ప్రతి ఒక్కరికీ ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు. సైకిల్ తొక్కడం అనేది అన్నింట్లోకి అత్యుత్తమ వ్యాయామం అని సైకిల్ తొక్కడం వల్ల వ్యక్తికి, సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అని అన్నారు. అందుకే సైకిల్ తొక్కండి’ అంటూ చంద్రబాబు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన గతంలో సైకిల్ తొక్కిన ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులు, పార్టీ కార్యకర్తలతో పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news