Dada Saheb Phalke Awards 2023: ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్​గా RRR..ఉత్తమ ఉత్తమ నటీనటులుగా రణ్​బీర్, ఆలియా

-

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కార కార్యక్రమం ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’ ముంబయిలో అట్టహాసంగా జరిగింది. సోమవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో సినీ తారలు సందడి చేశారు.

ఎస్​ఎస్​ రాజమౌళి దర్శకత్వం వహించి ‘RRR’ ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును సొంతం చేసుకుంది. ‘కాంతారా’లో నటనకు గానూ రిషబ్‌శెట్టి మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌ అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1), ఉత్తమనటిగా ఆలియాభట్‌ (గంగూబాయి కాఠియావాడి) చిత్రాలకు అవార్డును అందుకున్నారు. చిత్రీకరణలో బిజీగా ఉండి రణ్‌బీర్‌ హాజరుకాలేకపోవడంతో ఆయన సతీమణి అలియా భట్‌ ఉత్తమనటుడి అవార్డు అందుకున్నారు.

విజేతలు వీరే..

ఉత్తమ చిత్రం: ది కశ్మీర్‌ ఫైల్స్‌
ఉత్తమ దర్శకుడు: ఆర్‌.బాల్కి (చుప్‌: ది రివెంజ్‌ ఆఫ్‌ ఆర్టిస్ట్‌)
ఉత్తమ నటుడు‌: రణ్‌బీర్‌ కపూర్‌ (బ్రహ్మాస్త్ర-1)
ఉత్తమ నటి: అలియా భట్‌ (గంగూబాయి కాఠియావాడి)
మోస్ట్‌ ప్రామిసింగ్‌ యాక్టర్‌: రిషబ్‌శెట్టి (కాంతారా)
క్రిటిక్స్‌ బెస్ట్‌ యాక్టర్‌: వరుణ్‌ ధావన్‌ (బేడియా)
మోస్ట్‌ వర్సటైల్‌ యాక్టర్‌: అనుపమ్‌ ఖేర్‌
బెస్ట్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: సాచిత్ తాండన్‌
క్రిటిక్స్‌ ఉత్తమ నటి: విద్యాబాలన్‌ (జల్సా)
ఉత్తమ సహాయ నటుడు: మనీష్‌ పాల్‌ (జగ్‌ జగ్‌ జీయో)
ఫిల్మ్‌ ఆఫ్‌ ది ఇయర్‌: ఆర్‌ఆర్‌ఆర్‌

టెలివిజన్‌ విభాగంలో..

ఉతమ నటుడు: జైన్‌ ఇమనాన్‌
ఉత్తమ నటి: తేజస్వీ ప్రకాశ్‌
ఉత్తమ సహాయ నటి: షీబా చద్దా

వెబ్‌ సిరీస్‌ విభాగంలో..

ఉత్తమ వెబ్‌సిరీస్‌: రుద్ర: ది ఎడ్జ్‌ ఆఫ్‌ డార్క్‌నెస్‌
ఉత్తమ నటుడు: జిమ్ షార్బ్ (రాకెట్‌ బాయ్స్‌)
టెలివిజన్‌ సిరీస్ ఆఫ్‌ ఆది ఇయర్‌: అనుపమ (సీరియల్‌)

Read more RELATED
Recommended to you

Latest news