ఆ డైరెక్ట‌ర్ కి హ్యాండ్ ఇచ్చిన‌ రానా!

-

రానా వ‌ల్ల వ‌చ్చిన చిన్న సినిమా అవ‌కాశాల‌ను వ‌దులుకున్నాన‌ని…అందువ‌ల్ల ఎంతో లాస్ అయ్యాన‌ని వాపోతున్నాడుట‌. అయినా చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంటే సుఖ‌మేముంది. సినిమా రంగంలో ఇలాంటివ‌న్నీ స‌హ‌జంగా జ‌రిగేవే. హిట్లు ఉన్న ద‌ర్శ‌కుల వైపే హీరోలు చూస్తారు.

‘అలా ఎలా’ సినిమాతో అనీష్ కృష్ణ అనే యంగ్ డైరెక్ట‌ర్ ప‌రిచ‌యం అయిన సంగ‌తి తెలిసిందే. ప‌రిమిత బ‌డ్జెట్ లో మంచి కంటెంట్ తో తెర‌కెక్కిన చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి వ‌సూళ్ల‌ను సాధించింది. ఫేడౌట్ అయిపోయిన న‌టీన‌టులు..కొత్త వారితో తెర‌కెక్కినా కంటెంట్ లో మ్యాట‌ర్ ఉండ‌టంతో హిట్ అయింది. అటుపై అనీష్ ద‌గ్గుబాటి రానాకి ఓ క‌థ వినిపించాడు. లైన్ న‌చ్చ‌డంతో సినిమా చేస్తాన‌ని ప్రామిస్ చేసాడు. ఇది జ‌రిగి ఐదేళ్లు అవుతుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కూ రానా అత‌నితో సినిమా చేసింది లేదు. అయితే రానా ప్రామిస్ చేయ‌డంతో ఆ క‌థ‌పైనా నాలుగేళ్లు పాటు వ‌ర్క్ చేసాడు. మ‌ధ్య‌లో రాజ్ త‌రుణ్ తో ల‌వ‌ర్ అనే సినిమా చేసాడు. కానీ ఆ సినిమా ఫెయిలైంది.

అయినా రానా మాటిచ్చాడు అన్న న‌మ్మ‌కంతో వేరే ప్ర‌య‌త్నాలు చేయ‌కుండా ఉండిపోయాడు. అయితే తాజాగా రానా ఇప్ప‌ట్లో త‌న‌తో సినిమా చేసే ఉద్దేశం లేద‌న్న మెసెజ్ ని అనీష్ కు చేర‌వేసాడుట‌. ప్ర‌స్తుతం బిజీగా ఉన్నాన‌న‌ని…..ఖాళీ ఉన్న‌ప్పుడు చూద్దాం లేని…నీ ప్ర‌య‌త్నాల్లో నువ్వు ఉండూ…త‌న కోసం వెయిట్ చేయోద్ద‌ని చెప్పేసాడుట‌. దీంతో అనీష్ కు దిమ్మ తిరిగిపోయింద‌ని స‌మాచారం. నాలుగేళ్ల పాటు ఒకే క‌థ‌పై వ‌ర్క్ చేస్తే రానా ఇలా అనేసాడు? ఏంట‌ని స‌న్నిహితు వ‌ద్ద బాధ‌ప‌డుతున్నాడుట‌. స్టార్ హీరోల‌ను న‌మ్ముకుంటే ఇలాగే కొంపు ముంచుతార‌న్న విష‌యం ఆల‌స్యంగా అర్ధ‌మైందని ల‌బోదిబో మంటున్నాడుట‌.

రానా వ‌ల్ల వ‌చ్చిన చిన్న సినిమా అవ‌కాశాల‌ను వ‌దులుకున్నాన‌ని…అందువ‌ల్ల ఎంతో లాస్ అయ్యాన‌ని వాపోతున్నాడుట‌. అయినా చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకుంటే సుఖ‌మేముంది. సినిమా రంగంలో ఇలాంటివ‌న్నీ స‌హ‌జంగా జ‌రిగేవే. హిట్లు ఉన్న ద‌ర్శ‌కుల వైపే హీరోలు చూస్తారు.

అదీ ట్రెండింగ్ లో ఉండాలి. లేదంటే తేలిపోయిన‌ట్లే. నాలుగేళ్లు ఒక హీరో కోసం వెయిట్ చేయ‌డం అన్న‌ది ఫులీష్ నెస్. టాలీవుడ్ లో ఎంతో మంది హీరోలున్నారు. ఔత్సాహికులు ఎంతో మంది స‌క్సెస్ అవుతున్నారు. క‌థ‌లో ద‌మ్ముండాలే గానీ…ఆ హీరో కాక‌పోతే మ‌రో హీరో! ఇక్క‌డ ఎవ‌డి సినిమాకి ఆడే హీరో. అదీ మ్యాటర్.

Read more RELATED
Recommended to you

Latest news