Daily Hunt VerSe Innovation రికార్డు.. 805 మిలియన్ డాలర్ల సమీకరణ..!

-

ప్రముఖ న్యూస్ అగ్రిగేటర్ డైలీ హంట్, షార్ట్ వీడియో యాప్ జోష్ పేరెంట్ కంపెనీ అయిన VerSe Innovation తక్కువ కాలంలోనే జోరుగా దూసుకెళ్తోంది. 5 బిలియన్ల డాలర్ల విలువతో తాము 805 మిలియన్ డాలర్లను సమీకరించినట్లుగా సంస్థ తాజాగా తెలిపింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే..

VerSe ఇన్నోవేషన్‌ను వీరేంద్ర గుప్తా, శైలేంద్ర శర్మ 2007లో మొదలు పెట్టారు. ఉమంగ్ బేడీ ఈ సంస్థ లో ఫిబ్రవరి 2018లో చేరారు. టిక్‌టాక్ ని తొలగించాక 2020లో షార్ట్ వీడియో ప్లాట్‌ఫామ్ జోష్‌ను ప్రారంభించారు మరియు మంచి సక్సెస్ ని అందుకుంది. గుప్తా మరియు బేడీ ఒక సంయుక్త ప్రకటనలో ఈ పార్టనర్ షిప్ ద్వారా బిలియన్ వినియోగదారులకు సేవలందించే యాప్స్ ని తీసుకు వస్తామని అప్పుడు చెప్పారు.

అతిపెద్ద AI-ఆధారిత స్థానిక భాషా కంటెంట్ ప్లాట్‌ఫారమ్‌ను మా పార్టనర్ షిప్ లో తీసుకు వస్తామని చెప్పారు. VerSe ఇన్నోవేషన్‌లో మూడు కీలకమైన కన్స్యూమర్ టెక్నాలజీ ప్లాట్‌ఫారమ్‌లు ఉన్నాయి. అవే డైలీ హంట్, జోష్ మరియు పబ్లిక్ వైబ్.

వీడియో కంటెంట్ మీద ఫోకస్ పెట్టి భారతదేశంలో  తీసుకురావాలని వాళ్లు అప్పట్లో నిర్ణయించుకున్నారు. ఆఫర్స్ ని ఎక్స్పాన్డ్ చేసినప్పుడు, మోనిటైజేషన్ మోడల్స్, డెలివర్ సూపర్ లాటివ్ వెబ్ 3.0 ఎక్స్పీరియన్స్లు సృష్టించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పెట్టుబడి పెడతామని సంస్థ చెప్పింది.

ఇది ఇలా ఉంటే స్టార్టప్ తన AI/ML సామర్థ్యాలను మరెంత బాగా చేయడానికి మరియు లైవ్ స్ట్రీమింగ్ మరియు వెబ్ 3.0 వంటి కొత్త ప్రయత్నాలలో పెట్టుబడి పెట్టడానికి వాటిని ఉపయోగిస్తారు, షేర్‌చాట్, ఇంస్టాగ్రామ్ వంటి పోటీదారులతో పోరాడటానికి హెల్ప్ అవుతుంది. ఈ సంవత్సరం భారతీయ స్టార్టప్‌కి ఇది అతి పెద్ద ఫండింగ్ రౌండ్. ముఖ్యంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా మరి ఎక్కువ సమయం తీసుకున్నారు.

డైలీ హంట్ $805 మిలియన్లుతో అగ్రస్థానంలో వుంది. నెక్స్ట్ స్విగ్గి $700 మిలియన్లు వసూలు చేసింది. పాలీగాన్, బైజూస్ మరియు యూనిఫోర్ మొదలైనవి $400 మిలియన్లకు పైగా వసూలు చేసాయి. కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డ్ $425 మిలియన్ల ఇన్ఫ్యూషన్‌తో పెట్టుబడికి నాయకత్వం వహించింది. అలానే అంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ బోర్డ్, లక్సర్ క్యాపిటల్ మరియు సుమేరు వెంచర్స్ కూడా వున్నాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు కంపెనీ $2 బిలియన్లకు పైగా నిధులను సేకరించింది. గతేడాది $1.5 బిలియన్లు.

ప్రత్యక్ష వాణిజ్యం, Web3

రాబోయే వారాల్లో లైవ్ కామర్స్ ఫీచర్‌ను కూడా లాంచ్ చేస్తుంది. ఈ సంస్థ యొక్క ప్రధాన పోటీదారు, షేర్ చాట్ మోజే, ఫ్లిప్‌కార్ట్ తో కలిసి అక్టోబర్ 2021లో ప్రత్యక్ష వాణిజ్యాన్ని ప్రారంభించింది. అలానే ఇటీవల InMobi’s Glance జియో నుండి $200 మిలియన్లను పొందింది. వీడియో యాప్ రోపోసో ద్వారా పెద్ద ఎత్తున పందెం వేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news