కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా రికార్డ్….180 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తి

-

కరోనా కట్టడిలో ఇండియా గట్టి చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే దేశంలో అర్హులైన ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అందిస్తోంది. కరోనా కట్టడిలో మరో మైలురాయిని చేరుకుంది ఇండియా. దేశంలో అర్హులైన వారందరికి మొత్తంగా 180 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తియింది. ఇండియాలో 80 కోట్ల మంది అర్హులు ఇప్పటికీ రెండు డోసుల వ్యాక్సిన్ అందుకున్నారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ సమర్థవంతంగా సాగడంతో మూడో వేవ్ వచ్చినా దేశం తట్టుకుని నిలబడింది.

దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని 2020 జనవరి 16న ప్రారంభించింది. జనవరి 16 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలైంది. 2020 మార్చి 1 నుంచి వ్యాధిగ్రస్తులు, వృద్దులకు టీకాలు ఇవ్వడం ప్రారంభించారు. 2020 ఎప్రిల్ 1 నుంచి దేశంలో 45 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సినేషన్ ప్రారంభించారు. 2020 మే 1 నుంచి 18 ఏళ్లకు పైబడిన వారందరికి టీకాలు ఇస్తున్నారు. 2022 జనవరి నుంచి 15-18 ఏళ్ల టీనేజర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మార్చి 16 నుంచి ఈనెల 16 నుంచి 12-14 ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news