కూకట్‌పల్లిలో ఉద్రిక్తత.. బండి సంజయ్‌ను అడ్డుకునేందుకు దళిత సంఘాల యత్నం

-

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఇవాళ కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి యాత్ర షురూ చేశారు. కూకట్ పల్లి ఐడీఎస్ చెరువు వద్దకు రాగానే బండి పాదయాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ అనుబంధ దళిత సంఘాలు యత్నించాయి. నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని నిరసనకు దిగాయి.

పార్లమెంట్ నూతన భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే అశంపై కేంద్రం వైఖరికి తెలియజేయాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు.  లేదంటే బండి పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు. నిరసనకారులను పోలీసులు చెదరగొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారులకు మధ్య తోపులాట చేసుకుంది. అనంతరం అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
దిల్లీలో నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలనే ప్రతిపాదనను పరిశీలించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కేంద్ర సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల బండి సంజయ్‌ను కలిసిన ప్రజాగాయకుడు గద్దర్ పార్లమెంట్ భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టాలని వినతి పత్రం సమర్పించారు. గద్దర్ విజ్ఞప్తిని బండి కేంద్రానికి పంపించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version