స్టార్ హీరో పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్.. షాక్ లో ఇండస్ట్రీ..!

-

ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన ఘనత దర్శక ధీరుడు రాజమౌళిది అని చెప్పవచ్చు. ఆయన సినిమాలు దేశానికే గుర్తింపును తీసుకొచ్చాయి. ముఖ్యంగా బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు అంతర్జాతీయ స్థాయిలో విడుదలై తెలుగు సినిమా ఖ్యాతిని అమాంతం పెంచేసాయని చెప్పవచ్చు. ఇలాంటి స్టార్ డైరెక్షన్ లో ఒక్క సినిమా అయినా చేయాలి అని కుతూహలం చెందే సెలబ్రిటీలు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఒక స్టార్ హీరో వరుసగా ప్లాఫ్ లను చవిచూస్తున్న తన కొడుకును రాజమౌళి డైరెక్షన్లో చూపించాలని తెగ తాపత్రయ పడ్డారట.

ఇదే విషయంపై రాజమౌళిని కోరుతూ తన కొడుకుతో సినిమా చేయాలని.. ఎంత డబ్బైనా పర్లేదు ఇస్తానని చెప్పారట. కానీ రాజమౌళి మాత్రం అందుకు ససేమిర చెప్పినట్లు సమాచారం. మీ అబ్బాయి తో సినిమా చేసే ఆస్కారమే లేదు. ఇప్పటివరకు మీ అబ్బాయి చేసిన అన్ని సినిమాలు చూశాను.. మీ అబ్బాయికి హీరో అయ్యే లక్షణాలు లేవు.. అని చెప్పడంతో కోపోద్రిక్తుడైన ఆ స్టార్ హీరో ని అంత చూస్తాను.. నిన్ను డైరెక్టర్గా ఇండస్ట్రీలో ఎదగనివ్వను అంటూ బెదిరించాడట.

దాంతో రాజమౌళి సినిమాలైనా మానేస్తాను కానీ.. మీ కొడుకుతో మాత్రం సినిమా చేయను అని స్టార్ హీరో తో చెప్పినట్లు సమాచారం. మొత్తానికైతే రాజమౌళి ఇలా కామెంట్లు చేశారనే వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.దీన్ని బట్టి చూస్తే నటన రాని వ్యక్తికి ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ రాజమౌళి అవకాశం ఇవ్వరు అని స్పష్టం అవుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version