ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటి కే ఈ సినిమా నుంచి విడుదల అయిన.. పోస్టర్లు, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీ గా పెంచేశాయి. ఈ నేపథ్యంతోనే.. ఇవాళ ఈ సినిమా చిత్ర బృందం… ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా.. ఏపీ సర్కార్ నిర్నయం తీసుకున్న ఆన్ లైన్ విధానం, టికెట్ల ధరలపై కూడా చర్చ వచ్చింది.
ఓ విలేకరి.. టికెట్ల ధరలపై ఆర్ ఆర్ ఆర్ మూవీ నిర్మాత ధానయ్యను ఆడిగారు. ఈ సందర్భంగా.. జగన్ సర్కార్ పై దానయ్య కాస్త అసహనం వ్యక్తం చేశారు. ఆంధ్రాలో టికెట్ల రేట్లు తగ్గించారు, ఆ నిర్ణయం పెద్ద సినిమాలకు వేటికి వర్కౌట్ కాదు… అయితే.. మేము ఇంకా ఏపీ ప్రభుత్వంతో ఈ సమస్య గురించి సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాము. జగన్ సర్కార్ టికెట్ రేట్ల పై సానుకూలంగా స్పందిస్తుందని.. ఎదురు చూస్తున్నాము. లేకపోతే.. మాకు చాలా నష్టాలు వస్తాయి. అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.