సింగరేణి గనులపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరించే తీరుపై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. గురువు అయిన అద్వానీని ముంచినోల్లు బీజేపీ నేతలని.. అద్వానీని ముంచి అదానీలను పెంచుతున్నారని బీజేపీ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్ లో ఉన్న గనులు.. ప్రభుత్వం తన మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఇవ్వాలంటే… ఇచ్చేసిందని… కానీ తెలంగాణలో బొగ్గు బ్లాకులు ఇక్కడి సర్కార్ కి ఇవ్వాలని కోరితే మాత్రం ఇవ్వడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో సింగరేణిని… దెబ్బతీయడం కోసం ఇలాంటి కుట్ర కేంద్రం చేస్తుందని.. తెలంగాణలో విద్యుత్ కి అంతరాయం కలిగించే ప్రయత్నం చేస్తుందని ఫైర్ అయ్యారు. తెలంగాణ పట్ల బీజేపీ కి ఉన్న వ్యతిరేక భావన బయట పడిందని.. బొగ్గు గనులను అదానీ కి కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆగ్రహించారు. ప్రభుత్వ రంగ సంస్థలను హోల్ సేల్ గా అమ్మే కుట్ర జరుగుతుందన్నారు. కేంద్రం తెలంగాణ మీద కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని.. మొన్నటి వరకు వరి ధాన్యం కొనుగోలు మీద మోసం చేసిందని మండిపడ్డారు. ఇప్పుడు సింగరేణి మీద కక్ష సాధించే పనిలో పడిందన్నారు.