డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్ : సాయిధరమ్ తేజ్

-

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన పెద్ద మామయ్య చిరంజీవి గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. మెగాస్టార్ చిరంజీవి తన సినీ కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎన్నో జయాపజయాలను చవిచూశారు. ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. జాతీయ పురస్కారాలను సైతం అందుకున్నారు.తాజాగా చిరంజీవికి మరో అరుదైన ఘటన దక్కింది. చిరంజీవి తన సినిమా కెరీర్లో వేసిన డ్యాన్స్‌కు గాను ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’లో పేరు సంపాదించారు.

ఈ ఈవెంట్‌కు మెగా కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. అందులో సాయి ధరమ్ తేజ్ కూడా ఉన్నారు. చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు అందుకునేటప్పుడు మరోసారి విజిల్స్ వేస్తూ సందడి చేసాడు సాయి తేజ్. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా చిరంజీవికి కంగ్రాట్స్ చెబుతూ..‘డ్యాన్స్ అంటే చిరంజీవి గారు.. చిరంజీవి గారు అంటే డ్యాన్స్’.. ఊహ తెలిసాక నాకు తెలిసిన హీరో చిరంజీవి గారే..డ్యాన్స్ అంటే ఆయన స్టెప్పులే..ఆ డాన్సులకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కడం అరుదైన ఘట్టం అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version