జాబ్ కి క్వాలిఫికేషన్.. హీరోయిన్కి కమిట్మెంట్ అవసరం : దంగల్ బ్యూటీ

-

అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన దంగల్ అనే సినిమాలో గీతా ఫోగట్ పాత్రలో నటించిన ఫాతిమా సనా షేక్ ఆ తర్వాత అంతగా సినిమా అవకాశాలు అందుకోలేదు అనే విషయం తెలిసిందే. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్లతో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది. ఇటీవలే బాలీవుడ్లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది దంగల్ బ్యూటీ ఫాతిమా సనా షేక్.

తను బాల నటిగా కెరీర్ ప్రారంభించినప్పటికీ హీరోయిన్గా అవకాశాలు అందుకోవడానికి ఎన్నో కష్టాలు పడ్డా అంటూ చెప్పుకొచ్చింది. ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగినప్పటికీ తనకు అవమానాలు ఎదురయ్యాయి అంటూ తెలిపిన ఫాతిమా సనా షేక్… కమిట్మెంట్ ఇస్తేనే అవకాశం ఇస్తాము అంటూ కొంతమంది అడిగారు అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా జాబ్ కి క్వాలిఫికేషన్ ఎలాగో హీరోయిన్ కి కమిట్మెంట్ అలాగా అని కొంతమంది తనతో చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది ఫాతిమా సనా షేక్.

Read more RELATED
Recommended to you

Latest news