మళ్లీ పెరగనున్న టారిఫ్ చార్జీలు..!

-

గత కొంతకాలం క్రితం దేశంలోని టెలికాం రంగ సంస్థలు రేట్లను భారీగా పెంచడంతో వినియోగదారులు తీవ్ర ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు అతి తక్కువకే పొందిన సేవలను ఒక్కసారిగా రేట్లు పెరిగిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. ఇక ఇప్పుడు మరో సారి టారిఫ్ రేట్లు పెంచ పోతున్నారా అంటే అవుననే టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే వోడాఫోన్ ఐడియా తమ టారిఫ్ రేట్ ను త్వరలో పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. వోడాఫోన్ ఐడియా సంస్థ సీఈవో రవీందర్ టక్కర్ ఛార్జీలను పెంచుతూ ఉన్నామని..దీనిపై ఎలాంటి నిస్సిగ్గుగా భావించడం లేదు అంటూ స్పష్టం చేశారు. ఇక గతంలో కూడా ప్రస్తుతమున్న టారిఫ్ ఛార్జీలతో సంస్థ నడవలేము అంటూ ఎయిర్టెల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వొడాఫోన్ ఐడియా బాటలోనే మిగతా నెట్వర్కులు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news