దుబ్బాకలో కాంగ్రెస్ ఆఖరి ప్రయత్నం…!

-

దుబ్బాక ఉపఎన్నిక గడువు దగ్గర పడింది. ప్రచారానికి కొద్ది సమయమే ఉండడంతో….కాంగ్రెస్ నాయకులు ఆఖరి ప్రయత్నాలు మొదలుపెట్టారు. గెలుపు ఓటముల సంగతి ఎలా ఉన్నా… గౌరవ ప్రదంగానైనా ఉండాలని హస్తం నేతలు భావిస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో మొదటి నుండి కాంగ్రెస్ సమస్యలను ఎదుర్కొంటుంది. గడిచిన ముందస్తు ఎన్నికల్లో అసలు అక్కడ కాంగ్రెస్ బరిలోనే లేదు. దీనికి తోడు ముత్యంరెడ్డి పార్టీకి దూరం అయ్యాక క్యాడర్‌ దెబ్బతింది. నాయకులను నిలబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు పార్టీ పెద్దలు. అయితే ఉప ఎన్నికల్లో కనీసం గౌరవం అయినా నిలబెట్టుకోవాలని కొత్తగా వచ్చిన ఎన్నికల ఇంఛార్జి ఠాగూర్… పార్టీ సీనియర్ నాయకులు మొదలుకుని… పీసీసీ చీఫ్ వరకు అందరికి మండలాల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఇది ఇంకా మిగిలిపోయిన క్యాడర్‌కి కొంత ఊరట నిచ్చింది.

పార్టీ అగ్ర నాయకత్వం అంతా దుబ్బాకలో ఉండటం…ఎన్నికల్లో పెద్దగా కలిసి వస్తుందో లేదో కానీ…కొంత క్యాడర్‌ని మాత్రం నిలబెట్టుకోగలిగింది. ముత్యం రెడ్డి కుమారుడు శ్రీనివాస్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో… వారి వెంట నడిచిన నాయకులు తిరిగి కాంగ్రెస్ లో ఉండటానికి నాయకుల పర్యటన కొంత కలిసి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో కూడా ముత్యంరెడ్డి చేసిన అభివృద్ధి పనులే చెప్పుకుంటుంది కాంగ్రెస్. గ్రామానికి నాయకులు ఇంఛార్జ్‌లుగా ఉన్నా… ప్రస్తుతం ఉన్న పోలింగ్ ప్రక్రియలో అనుసరించాల్సిన వ్యూహాల్లో మాత్రం కాంగ్రెస్ వెనకపడిందనే ప్రచారం ఉంది.

ఉప ఎన్నికల హీట్ అంతా… బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే కనిపిస్తోంది. దీంతో, కాంగ్రెస్ కొంత వెనకబడిందనే టాక్ వినిపిస్తోంది. పీసీసీ వర్గాలు మాత్రం… దుబ్బాకలో క్యాడర్ కూడా లేదనుకునే పరిస్థితి నుండి కొంత మేరుగయ్యామనే లెక్కలు వేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news