వేసవికాలం వచ్చిందంటే చిన్న పిల్లల నుండి ముసలివారి వరకు శీతల పానీయాలను తీసుకోవడానికి మక్కువ చూపిస్తారు. వీటిలో ఐస్ క్రీమ్ అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కానీ నిన్న జరిగిన ఒక సంఘటన ఇలాంటి ఐస్ క్రీమ్ తినే వారికి ఒక హెచ్చరిక అని చెప్పాలి. ఐస్ క్రీమ్ ల సీజన్ కావడం వలన చాలామంది ఈ ఐస్ క్రీమ్ తయారీలను వ్యాపారంగా ఎంచుకుంటున్నారు. కొందరు అయితే నకిలీ ఐస్ క్రీమ్ లను తయారుచేసుకుంటూ మార్కెట్ లోకి వదులుతున్నారు. ఇలా తయారుచేసిన ఐస్ క్రీమ్ లకు నీకిలీ స్టికర్ లను అంటించి అమ్మేస్తున్నారు.