కొత్త గా వచ్చిన కరోనా వేరియంట్ ఓమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్ సహా అనేక దేశాలలో ఓమిక్రాన్ వేరియంట్ చాలా వేగం గా విస్తరిస్తుంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తం గా 722 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు వచ్చాయి. అందులో సౌత్ ఆఫ్రీకా దేశం లో నే 217 ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. నిజానికి ఓమిక్రాన్ వేరియంట్ కూడా దక్షిణాఫ్రీకా నుంచే మొదలైంది.
అక్కడి నుంచి వైరస్ సోకిన వారు వివిధ దేశాలకు ప్రయాణించడం తో ఓమిక్రాన్ వేరియంట్ వేగం గా విస్తరించింది. చాలా తక్కవ సమయం లో నే ఎక్కువ దేశాలకు ఈ ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందింది. కాగ మన భారత్ లో కూడా నాలుగు ఓమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. అంతే కాకుండా మరి కొంత మంది లక్షణాలు కూడా ఉన్నాయని తెలుస్తుంది. దీనిని నిర్ధారించడానికి వారి శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు. కాగ ఈ ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి వేగం గా ఉన్నా.. దీని తో మరణాలు మాత్రం జరగడం లేదు.