Bigg Boss 5 : హౌస్ నుంచి ప్రియాంక అవుట్? హింట్ ఇచ్చిన నాగ్

-

బిగ్ బాస్ సీజ‌న్ 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. రేసు టూ ఫీనాలే కూడా మొద‌లైంది. ఫ‌స్ట్ రేస్ టూ ఫీనాలే టికెట్ ను మాన‌స్ ద‌క్కించు కున్నాడు. అయితే ఈ ఎలిమినేష‌న్ ప్ర‌క్రియా కూడా కొనసాగుతుంది. కాగ ఈ వారం నామినేష‌న్స్ లో సిరి, ప్రియాంక సింగ్, కాజ‌ల్, మాన‌స్, శ్రీ రామ చంద్ర ఉన్నారు. అయితే ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ప్రియాంక సింగ్ అని తెలుస్తుంది. దీని కి సంబంధించిన హింట్ ను కూడా హోస్ట్ నాగార్జున ఇచ్చేశాడు.

శ‌నివారం నాటి ఎపిసోడ్ చివ‌ర్లో కుటుంబ స‌భ్య‌ల ను క‌లిసేందుకు కంటెస్టంట్లు త‌ప్ప‌కుండా త‌మ కు ఇష్ట‌మైన వ‌స్తువును త్యాగం చేయాల‌ని బిగ్ బాస్ ఆదేశిస్తాడు. దీంతో కంటెస్టంట్లు అంద‌రూ కూడా త‌మ కు ఇష్ట మైన వ‌స్తువుల‌ను త్యాగం చేసి కుటుంబ స‌భ్య‌ల‌ను క‌లుస్తారు. అయితే శని వారం ఎపిసోడ్ లో కంటెస్టంట్లు త్యాగం చేసిన వ‌స్తువుల‌ను నాగార్జున తిరిగి ఇచ్చేస్తాడు. అయితే అందులో సిరి, ప్రియాంక సింగ్ ల‌కు వ‌స్తువులు రావు. వారి వ‌స్తువులు కూడా తిరిగి రావాలంటే మిగ‌తా కంటెస్టంట్లు త‌మకు ఇష్ట‌మైన వ‌స్తువ‌లను త్యాగం చేయాల‌ని నాగ్ చెబుతాడు.

 

అయితే ఎక్కువ బ‌రువు తో వ‌స్తువులు వ‌చ్చ‌న వారే హౌస్ లో ఉండ‌టానికి అర్హులు అని చెబుతాడు. దీంతో ష‌ణ్ముక్, కాజ‌ల్ సిరి గెలుపు కోసం త‌మ కు ఇష్ట మైన వ‌స్తువుల‌ను త్యాగం చేస్తారు. మాన‌స్, సన్ని ప్రియాంక సింగ్ కోసం త్యాగం చేస్తారు. అయితే చివ‌రికి సిరి గెలుస్తుంది. దీంతో సిరి హౌస్ లో కొన‌సాగే కంటెస్టంట్ అని తెలుస్తుంది. ప్రియాంక సింగ్ ఆదివారం నాటి ఎపిసోడ్ లో ఎలిమినేట్ అవ‌బోతుంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news