ముదురుతున్న నల్ల జ్వరం..బ్లాక్‌ ఫీవర్‌ లక్షణాలు ఇవే..!

-

అసలే కరోనా.. ఆపై వర్షాకాలం.. ఈ మహమ్మారి నుంచే ఎలా తప్పించుకోవాలర్రా బాబూ అనుకుంటుంటే.. ఇంకా ఏవేవో వైరస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు బ్లాక్‌ ఫీవర్‌ అంట..కొత్తది వచ్చింది. ఇప్పటికే పశ్చిమ బెంగాళ్‌లోని 11 జిల్లాలో 65 బ్లాక్‌ ఫీవర్‌ కేసులు నమోదు అయ్యాయి. జార్ఖాండ్‌లో కూడా ఈ నల్ల జ్వరంతో ఒకరు మృతి చెందారు. అసలేంటి ఈ బ్లాక్‌ ఫీవర్‌.. ఎలా వస్తుంది. ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది..?

బ్లాక్ ఫీవర్‌ని కాలా అజర్ అని కూడా అంటారు. ఈ వ్యాధికి కారణం Leishmania donovani అనే పరాన్నజీవి. ఇప్పటివరకు దీనికి వ్యాక్సిన్‌ డవలప్‌ చేయలేదు. శాండ్‌ఫ్లై కాటు ద్వారా శరీరంలోకి చేరే ఈ వ్యాధికి లీష్మానియా అనే పరాన్నజీవి ఈ బ్లాక్ ఫీవర్కు కారణం. ఈ సాండ్‌ఫ్లై గోధుమ రంగులో ఉంటుంది. ఈ ప్రత్యేక రకం ఫ్లై మట్టి , అధిక తేమ ఉన్న ఇళ్లలో ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యాధి వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువ..

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఇప్పటికే పోషకాహార లోపంతో బాధపడుతున్న వ్యక్తులకు బ్లాక్ ఫీవర్‌ సోకే ప్రమాదం ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేకపోవడం, రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వారికి ఎక్కువగా వస్తుంటుంది. అంతే కాకుండా వాతావరణంలో వచ్చే మార్పులు కూడా ఈ వ్యాధికి కారణం. 2020లో బ్రెజిల్, చైనా, ఇథియోపియా, ఇండియా, కెన్యా, సోమాలియా, దక్షిణ సూడాన్, యెమెన్‌లలో 90 శాతం కేసులు నమోదయ్యాయి.

ఎలాంటి లక్షణాలు:

చాలా రోజులు జ్వరం, బరువు తగ్గడం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. అటువంటి సందర్భాలలో చర్మం పొడిగా మారుతుంది. దద్దుర్లు వస్తాయి. జుట్టు రాలుతుంది. చర్మం రంగు బూడిద రంగులో కనిపించడం ప్రారంభమవుతుంది. దీని ప్రభావం చేతులు, కాళ్లు, పొట్ట, వీపుపై ఉంటుంది. అందుకే దీనికి బ్లాక్ ఫీవర్ అని పేరు పెట్టారు. ఈ లక్షణాలు ఉన్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version