మే 30 నుంచి ‘దసరా’ స్ట్రీమింగ్..ఎందులో అంటే ?

-

కొత్త డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా.. మహానటి కీర్తిసురేష్ హీరోయిన్గా తెరకెక్కిన చిత్రం దసరా.. మార్చి 30న విడుదలైన ఈ సినిమా మంచి పాపులారిటీని దక్కించుకుంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని చంకీల అంగీలేసి పాటకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

ప్రస్తుతం విడుదలైన వెన్నెల మాస్ డాన్స్ వీడియో అయితే నెట్టింట షేక్ చేస్తోందనే చెప్పాలి. ఇప్పుడు ఎక్కడ చూసినా వెన్నెల మాస్ డాన్స్ ఒక ఊపు ఊపేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ నెట్‌ ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను మే 30 నెట్‌ ఫ్లిక్స్‌… ఓటీటీలో రిలీజ్‌ చేయనుందట. అలాగే.. ఈ సినిమా హిందీ ఓటీటీ రైట్స్‌.. హాట్‌ స్టార్‌ సొంతం చేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news