రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారు : దాసోజు శ్రవణ్‌

-

తెలంగాణలో రాజకీయాలు వేడెక్కాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ అయితే.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు దాసోజ్‌ శ్రవణ్‌ ప్రకటించడంతో ఒక్కసారిగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఉలిక్కిపడ్డారు. అయితే.. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. సోనియా, రాహుల్ గాంధీ ఆలోచనలు తుంగలో తొక్కి రేవంత్ పని చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్, మనిక్కం ఠాగూర్, సునీల్ ముగ్గురు కుమ్మక్కయ్యారన్నారు దాసోజు శ్రవణ్‌. ఇద్దరు రేవంత్ కు తాబేధారులు అయ్యారని, ప్రశ్నించే వాళ్లపై తప్పుడు నివేదికలు ఏఐసీసీకి ఇస్తున్నారని ఆరోపించారు దాసోజు శ్రవణ్‌. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, మాణిక్కం ఠాగూర్, సునీల్‌లు రేవంత్ తప్పులపై మాట్లాడడం లేదని, కొప్పుల రాజు, జై రాం రమేశ్ కూడా ఏమి చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉందన్నారు దాసోజు శ్రవణ్‌.

రేవంత్ రెడ్డి పార్టీ నాయకులను బలహీన పరిచే ప్రయత్నం చేస్తున్నారని, టీపీసీసీ లో సొంత ముఠాను రేవంత్ ను తయారు చేశారని విమర్శించారు దాసోజు శ్రవణ్‌. ప్రతి నియోజకవర్గంలో బహుళ నాయకత్వం ను రేవంత్ ప్రోత్సాహిస్తున్నారని, రేవంత్ నాయకత్వంలో సొబర్ కాంగ్రెస్ పార్టీ…రాబర్ కాంగ్రెస్ పార్టీగా మారిందన్నారు దాసోజు శ్రవణ్‌. ఏఐసీసీ నుంచి టీపీసీసీని ఫ్రాంచైజ్ తాను తెచ్చుకున్నట్టు రేవంత్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ ఎవరికి దొరకడని, రేవంత్ దగ్గర ఎల్ 1, ఎల్ 2, ఎల్ 3, ఎల్ 4 దర్శనాలు ఉంటాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు దాసోజు శ్రవణ్‌. మాఫియాను నడిపినట్టు రేవంత్ నడుపుతున్నారన్నారని ధ్వజమెత్తారు దాసోజు శ్రవణ్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version