దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ.. పోలీసుల అదుపులో ముఠా

-

దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసి విక్రయిస్తున్న ముఠాను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. బ్యాంకులు, సిమ్‌ కార్డుల పేరుతో సైబర్‌ నేరగాళ్లు సందేశాలు పంపుతున్నారు. ఈ సందేశాల ద్వారా వారు పంపే లింకులను క్లిక్‌ చేయడంతో వినియోగదారుల వ్యక్తిగత డేటా మొత్తం చోరీ చేస్తున్నారు. సంబంధం లేకపోయినా అనవసర సందేశాలు పంపుతూ దేశవ్యాప్తంగా కోట్ల మంది డేటాను చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనరేట్ల పరిధిలో వందల సంఖ్యలో కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. కేవైసీ అప్‌డేట్‌, క్రెడిట్‌, డెబిట్‌ కార్డుల సమాచారాన్ని అప్‌డేట్‌ చేసుకోవాలంటూ ఇటీవల హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ బ్యాంకుల పేరుతో అధిక సంఖ్యలో సందేశాలు వచ్చాయి. వీటిపై మూడు కమిషనరేట్ల పరిధిలో బాధితుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న సైబరాబాద్‌ పోలీసులు దేశవ్యాప్తంగా ఈ దందా చేస్తున్న వారిని అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version