కొంప ముంచేస్తున్న ఆన్లైన్ డేటింగ్ యాప్స్, సమాచారం సేఫ్ కాదు…!

-

ఆన్లైన్ డేటింగ్ యాప్స్ లో సమాచారం భద్రంగా ఉంటుందా…? చెప్పడం కాస్త కష్టమే. తాజాగా ఒక నివేదిక వెల్లడి అయింది. ఈ నివేదికలో కొన్ని జీబీల డేటా డేటింగ్ యాప్స్ నుంచి బయటకు వెళ్ళింది అని గుర్తించారు. భద్రతా పరిశోధకులు… నోమ్ రోటెమ్ మరియు రాన్ లోకార్ మే 24 న ఓపెన్ ఇంటర్నెట్‌ ను స్కాన్ చేస్తున్నప్పుడు ఓపెన్ గా యాక్సెస్ చేయగల అమెజాన్ వెబ్ సర్వీసెస్ “బకెట్ల” డేటా చూసి షాక్ అయ్యారు.

ప్రతి ఒక్కటి 3 సోమ్స్, కౌగరీ, గే డాడీ బేర్, ఎక్స్‌పాల్, బిబిడబ్ల్యు డేటింగ్, క్యాజువాల్క్స్, షుగర్డి, హెర్పెస్ డేటింగ్ మరియు జిహంట్‌తో సహా ఇతర డేటింగ్ యాప్స్ నుంచి డేటా కలిగి ఉంది అని వారు గుర్తించారు. ఈ బకెట్స్ లో మొత్తం వీరు 845 గిగాబైట్ల మరియు 2.5 మిలియన్ రికార్డులను గుర్తించారు. వేలాది మంది డేటా ఇందులో ఉంది అని వెల్లడించారు. సమాచారం ముఖ్యంగా చాలా సున్నితమైనది అని వారు తెలిపారు.

న్యూడ్ గా ఉన్న ఫోటోలు ఆడియో రికార్డ్ లు ఉన్నాయని గుర్తించారు. ఇతర ప్లాట్‌ ఫారమ్‌ లలో చేసిన ప్రైవేట్ చాట్‌ ల స్క్రీన్‌ షాట్‌ లు అలాగే పేమెంట్ రిసిప్ట్ లు గుర్తించారు. బయటకు వచ్చిన డేటాలో వారి పేర్లు, పుట్టిన రోజులు ఇమెయిల్ చిరునామాలు వంటి సున్నితమైన డేటా, వ్యక్తిగత సమాచారం ఉందని గుర్తించారు. యాప్స్ వాడే వారిని గుర్తించడానికి హ్యాకర్ అందుబాటులో ఉన్న ఫోటోలను, డేటాను గుర్తించవచ్చు అని వారు హెచ్చరించారు.

ఆ బయటకు వచ్చిన డేటా… దాని పరిమాణంతో పాటు అది ఎంత సున్నితమైన డేటానో అర్ధమైన తర్వాత మేము షాక్ అయ్యామని వారు వివరించారు. వీటి ద్వారా దొంగతనాలు, మానసికంగా వేధింపులు వంటివి జరుగుతాయని హెచ్చరించారు. ఇది చాలా ఈజీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు అని పేర్కొన్నారు. అయితే ఈ డేటా అంతా కూడా ఒక లింక్ ద్వారానే వచ్చింది అని పేర్కొన్నారు. ఇది హ్యాకింగ్ కాదని డేటా నిల్వ చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోలేదు అని పేర్కొన్నారు. ఇలాంటి యాప్స్ లో వ్యక్తిగత సమాచారం విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు

Read more RELATED
Recommended to you

Latest news