ప్రేమ‌కు అడ్డు అని.. ప్రియుడి సాయంతో త‌ల్లిని హ‌త్య చేసిన కూతురు

-

త‌న ప్రేమ‌కు అడ్డు వ‌స్తుంద‌ని.. క‌న్న త‌ల్లినే కూతురు హ‌త్య చేసింది. ప్రియుడి సాయంతో త‌ల్లిని హ‌తమార్చింది. ఈ ఘ‌ట‌న జ‌న‌వ‌రి 30 జ‌రిగింది. కాగ ప్ర‌మాదంగా చిత్రిక‌రించి.. అంత్య క్రియ‌లు చేశారు. కానీ పోలీసుల విచార‌ణ‌లో సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట ప‌డ్డాయి. ఈ దారుణ‌మైన ఘ‌ట‌న క‌ర్నాట‌క రాష్ట్రంలోని కొర‌టిగెరె ప‌ట్ట‌ణంలో చోటు చేసుకుంది. కాగ కొర‌టిగెరి ప‌ట్ట‌ణంలో సుమిత్ర (45) త‌న కూతురు శైల‌జ‌తో నివాసం ఉంటుంది. కాగ శైల‌జ.. దూర బంధువు అయిన పునిత్ తో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించింది.

అయితే శైలజ‌కు పునిత్ సోద‌రుడు అవుతాయ‌ని సుమిత్ర అడ్డు త‌గిలింది. దీంతో శైల‌జ.. త‌న త‌ల్లి సుమిత్ర‌పై కోపం పెంచుకుంది. త‌న ప్రేమకు అడ్డు తొల‌గించాల‌ని భావించింది. దింతో ప్రియుడు పునిత్ తో ప‌థ‌కం ప‌న్ని.. జ‌న‌వ‌రి 30 వ తేదీన త‌ల్లి పీక‌ను పిసికి హ‌త్య చేసింది. అనంతరం.. త‌ల్లి మృత దేహాన్ని నీటి సంపులో వేసి ప్ర‌మాదంల చిత్రించింది. అయితే ఈ కేసులు పోలీసులు విచార‌ణ చేప‌ట్ట‌గా సంచ‌ల‌న విషయాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. తానే త‌ల్లిని హ‌త్య చేసిన‌ట్టు శైల‌జ అంగీక‌రించింది. దీంతో శైల‌జతో పాటు పునిత్ ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news