తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మక పథకంగా తీసుకువచ్చిన పథకాల్లో రైతు బీమా పథకం ఒకటి. రైతులకు లబ్ధి చేకూరలనే ఉదేశంతో ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. రైతులు బీమాను వర్తింపచేస్తూ.. ప్రభుత్వ ఏటా ఎల్ఐసీకి బీమాకు అవసరమైన డబ్బులను చెల్లిస్తోంది.
ఇదిలా ఉంటే రైతు బీమా పథకంపై హైకోర్ట్ లో పిటీషన్ దాఖలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికి రైతబీమా వర్తించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మంది రైతుల ఉంటే కేవలం 32 లక్షల మందికి మాత్రమే బీమా చేరని పిటిషనర్ అంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మిగిలిన 34 లక్షల మంది రైతులకు బీమా వర్తించేాలా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్ట్ ఆదేశాలు జారీ చేసింది. 6 వారాల్లో నివేదిక సమర్పించాలని హైకోర్ట్ ఆదేశించింది. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది హైకోర్ట్.