తెలంగాణ సీఎంవోలో మొన్నటివరకు టూరిజం శాఖలో ప్రిన్సిపల్ సెక్రెటరీ బాధ్యతలు చూసిన స్మితా సబర్వాల్‌ను ఆ బాధ్యతల నుంచి రేవంత్ సర్కార్ తప్పించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై మొన్నటివరకు ఐటీ శాఖలో కీలక బాధ్యతలు చేపట్టిన జయేష్ రంజన్ సంచనల వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘స్మితా సబర్వాల్ ఎందుకు బదిలీ అయ్యిందో అందరికి తెలుసు.
ఆమె లేకపోతే ఏ ఈవెంట్ జరగదు అనుకోవడం తప్పు.నాకూ చాలా ఈవెంట్స్ చేసిన అనుభవం ఉంది. నేను అనేక దేశాల్లో తిరిగి చాలా పెద్ద ఈవెంట్లు చేశాను. స్మితా లేకపోతే ఏదో అవుతుందన్న అపోహ వద్దు. ఆమె బాగా పని చేసింది కానీ ఆమె లేనంత మాత్రాన ఏ ఈవెంట్ ఆగిపోదు’ అని తెలంగాణ CMO స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేష్ రంజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.