Breaking : DAV స్కూల్ ఘటనలో ప్రిన్సిపల్ మాధవి అరెస్ట్

-

డీఏవీ పబ్లిక్ స్కూల్‌ చోటు చేసుకున్న ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై ఇప్పటికే.. నిందితుడు రజనీకుమార్‌ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ఇప్పుడు పోలీసులు స్కూల్ ప్రిన్సిపాల్ మాధవిని కూడా అరెస్ట్ చేశారు. LKG బాలికపై స్కూల్ ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ రజనీకుమార్ రెండు నెలలుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు పోలీసులు.

నిందితుడిని కాపాడేందుకు ప్రిన్సిపాల్ మాధవి ప్రయత్నిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. నాలుగేన్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై స్కూల్ ప్రిన్సిపాల్ మాధవికి సమాచారం తెలుపగా, ఆమె నిర్లక్ష్యంగా తల్లిదండ్రులకు సమాధానం ఇచ్చారు. ఈ వాట్సాప్ చాటింగ్ బయటకు వచ్చింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రిన్సిపాల్ మాధవిపై కేసు నమోదు చేశారు. బాలిక తండ్రి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version