ఇండియా ఆసీస్ మ్యాచ్ లో వార్నర్ బుట్టబొమ్మ స్టెప్

Join Our COmmunity

ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్నర్ కు ఈ బుట్టబొమ్మ పిచ్చి వదిలినట్టు కనిపించడం లేదు. భారత్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నిన్న పెర్త్ వేదికగా మొదటి వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో వార్నర్ ఓపెనర్ గా అదరగొట్టాడు. ఫీల్డింగ్ చేస్తూ బౌండరీ లైన్ దగ్గర నిలబడిన వార్నర్ అక్కడ అకూడా బుట్ట బొమ్మ పాట స్టెప్పులు వేస్తూ కనిపించాడు. దీంతో అభిమానులు అలా వేస్తున్న సముయంలో వీడియోలు తీసి ఇంటర్నెట్ లో వైరల్ చేశారు.

ఐపీఎల్ లో సన్రైజర్స్ కెప్టెన్ గా ఉన్న వార్నర్ లాక్ డౌన్ సమయంలో తెలుగు పాటలకు బాగా అలవాటు అయ్యాడు. ముఖ్యంగా మనోడు బుట్ట బొమ్మ పాటకి వీరాభిమాని. తను ఈ పాటను తన భార్యతో కలిసి డ్యాన్స్ చేసి టిక్ టాక్ లో పెట్టి మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఇక ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైంది. ఆసీస్‌ నిర్దేశించిన 375 పరుగుల టార్గెట్‌లో భాగంగా టీమిండియా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 308 పరుగులకే పరిమితం అయింది. ఫలితంగా మొదటి మ్యాచ్ లోనే ఓటమి పాలైంది.

TOP STORIES

ఐఓఎస్ ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు స‌మ‌స్య‌లు.. లాగిన్ అవ‌డంలో ఇబ్బంది..

వాట్సాప్ కార‌ణంగా ప్ర‌స్తుతం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌కు ఇప్పుడు సాంకేతిక స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్నాయి. ఫేస్‌బుక్‌కు చెందిన ఐఓఎస్ యాప్‌ను వాడుతున్న యూజ‌ర్ల‌కు...
manalokam telugu latest news