ఆస్ట్రేలియన్ క్రికెటర్ వార్నర్ మెచ్చిన తెలుగు హీరో..

-

ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ కి ఆడుతున్నప్పటి నుండి తెలుగు వారందరికీ బాగా దగ్గరయ్యాడు. అటు సన్ రైజర్స్ తరపున మ్యాచులాడుతూ, అందరికీ ఆనందం పంచుతూనే మరో పక్క తెలుగు సినిమాల మీద అభిమానం చూపుతూ మరింత ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాడు. కరోనా లాక్డౌన్ టైమ్ లో డేవిడ్ వార్నర్ చేసిన టిక్ టాక్ వీడియోల గురించి అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా డైలాగులని చెబుతూ అందరికీ ఆనందం పంచాడు.

ఐతే తాజాగా వార్నర్ వీడియో ఒకటి ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది. తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరని అడిగిన ప్రశ్నకి, వార్నర్ ఈ విధంగా సమాధానం చెప్పాడు. తెలుగు హీరోల్లో నచ్చిన వారు చాలామంది ఉన్నారు. కానీ బాగా అభిమానించే వారిలో మహేష్ బాబు ఉన్నాడని తెలిపాడు. తాను అభిమానించే తెలుగు హీరో మహేష్ అని చెప్పుకొచ్చాడు. ఈ వీడియోలో వార్నర్ తో పాటు విజయ్ శంకర్, వృద్ధిమాన్ సాహా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news