అంత్యక్రియలు చేస్తుండగా లేచిన శవం..!!

-

అయినవాళ్లు చనిపోతే ఆ బాధ చాలా దారుణంగా ఉంటుంది. వారి శవం మీద పడి..లేవరా అని ఏడుస్తారు.. అలా ఏడ్చినంత మాత్రనా పోయినవాళ్లు అయితే తిరిగి రారు కాదు కదా.. కానీ తమిళనాడులోని పుదుకోట జిల్లా.. ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో చనిపోయిన వ్యక్తి లేచి వచ్చాడు. ఇప్పుడు ఈ వార్త తెగ వైరల్ అవుతుంది. అలా ఎలా జరిగింది. చనిపోయిన వ్యక్తి ఎలా వచ్చాడు.. అంటే చనిపోకుండానే అలా అనుకున్నారా.?

అసలేమైందంటే.. 60 ఏళ్ల రైతు షణ్ముగం.. గుండె, లివర్ సమస్యతో ఇబ్బంది పడుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే పొన్నమరావతిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ తర్వాత ఏమైందో గానీ.. అతను చనిపోయాడంటూ.. కుటుంబ సభ్యులు అతన్ని తిరిగి గ్రామానికి తీసుకొచ్చారు. ఇక అంత్యక్రియలు చేయడానికి కూడా రెడీ అయిపోయారు.

విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లంతా ఇంటికి వచ్చారు. ఇక వ్యక్తి చనిపోతే ఎలా అంటుందో తెలుసు కదా..! కుటుంబ సభ్యులను ఓదార్చడం మొదలుపెట్టారు. బంధువులకు కూడా విషయం తెలిసింది. వారంతా షణ్ముగం ఇంటికి బయలుదేరారు. చుట్టుపక్కల బంధువులు అప్పటికే.. ఆ ఇంటికి వచ్చారు. అంత్యక్రియలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఆ తర్వాత షణ్ముగం మృతదేహాన్ని ఇంటిబయట తిన్నెపై కూర్చోబెట్టారు. ఆచారం ప్రకారం షణ్ముగం కొడుకు చివరిసారిగా తండ్రి నోట్లో పాలుపోశాడు. ఆ పాలు నోట్లోకి వెళ్లీ వెళ్లగానే.. ఒక్కసారిగా దగ్గుతూ షణ్ముగం కళ్లు తెరిచాడు.

అంతే.. అక్కడున్న వారికి ఫీజులు ఎగిరిపోయాయి.. అందరూ తనవైపు ఆదోలా చూస్తుంటే.. ఏమైంది? ఎందుకు ఇంత మంది వచ్చారు? అని అడిగాడు. ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం రెండూ అక్కడున్న వారిలో కలగడం మొదలయ్యాయి. ఇలా చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి బతికాడని వారంతా సంతోషపడ్డారు. మరి షణ్ముగం నిజంగానే చనిపోయి బతికాడా? అనేది తేలాల్సిన ప్రశ్న. అతను చనిపోకపోయి ఉంటే.. మరి డాక్టర్లు ఏమని చెప్పారు? చనిపోకపోయినా చనిపోయాడని డాక్టర్లు చెప్పారా? ఇలా ఈ ఘటనపై వంద ప్రశ్నలు తలెత్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news