సీనియర్ నేతలకు కోమటిరెడ్డి మద్దతు

-

టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు తిరుగుబాటు ప్రారంభించారు. భట్టి విక్రమార్క నివాసంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మహేశ్వర్ రెడ్డి, కోదండ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ప్రేమ్ సాగర్ రావు తదితర నేతలు సమావేశం అయ్యారు. కొందరు సోషల్ మీడియాలో సీనియర్ నేతలను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని, పార్టీని బలహీనపరుస్తున్నారని మండిపడ్డారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి పదవులు కట్టబెట్టారని అన్నారు.

komatireddy venkat reddy

రేవంత్ రెడ్డి పై తిరుగుబాటు చేసిన సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. సీనియర్లకు ఆయన మద్దతు తెలిపారు. వారు ఎలాంటి నిర్ణయం తీసుకున్న వారి వెంటే ఉంటానని చెప్పారు. ఇక సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్తామని.. దేశవ్యాప్తంగా పార్టీని కాపాడుకుంటామని అన్నారు సీనియర్ నేతలు. సీనియర్లపై కోవర్టులు అనే ముద్ర వేస్తున్నారని, ఒరిజినల్ కాంగ్రెస్ తమదేనని.. వలస వచ్చిన వాళ్ళతో పోరాడతామని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news