టర్కీ, సిరియాల్లో 20వేలు దాటిన మృతులు.. వణికించే చలిలో బాధితులు

-

టర్కీ, సిరియాల్లో భూకంపం మృత్యువిలయం సృష్టించింది. ఇప్పటికే ఇరు దేశాల్లో కలిపి 20వేలకు పైగా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో క్షతగాత్రులయ్యారు. ఓవైపు కాళ్ల కింద భూమి నిలువునా కదిలిపోయి భవనాలన్నీ కుప్పకూలి వేలమంది ప్రాణాలను బలిగొంటే.. బాధితులుగా మిగిలినవారిని చలి చంపేస్తోంది. తలదాచుకునే చోటు కనిపించక ప్రజలంతా అల్లాడిపోతున్నారు. ఆహారం, తాగునీరు కోసం వారు ఎదురుచూస్తున్నారు.

పెను విపత్తు తర్వాత సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం ఆశినంత వేగాన్ని కనపరచడం లేదనే విమర్శలు మొదలయ్యాయి. మే నెలలో జరిగే ఎన్నికల్లో మరోసారి నెగ్గాలని తపిస్తున్న టర్కీ అధ్యక్షుడు రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగాన్‌కు ఇది ఇబ్బందికర పరిణామమే. హతాయ్‌ ప్రావిన్సులో ఆయన పర్యటించారు. చర్కీలో ఇప్పటివరకు 16,100 మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన తెలిపారు. పొరుగున ఉన్న సిరియాలో మరో 3,200 మంది మృతి చెందారు. దీంతో ఈ ప్రకృతి విపత్తులో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 20,500కు పెరిగింది.

Read more RELATED
Recommended to you

Latest news