2045 తర్వాత మీకు చావు రాదు.. వృద్ధాప్యం దరిచేరదు….!!

-

చావు, వృద్ధాప్యం.. ఈ రెండు అంటేనే మనిషికి చాలా భయం. ఎందుకంటే.. ప్రపంచం ఆగినా ఈ రెండు మాత్రం ఆగవు. వృద్ధాప్యం దాంతో పాటు చావు కూడా మనిషిని వెతుక్కుంటూ రావాల్సిందే. చావు అనేది అనివార్యం. ప్రపంచంలోని ఏ జీవి అయినా చివరకు తనువు చాలించాల్సిందే. దానికి ఎవరూ అతీతులు కారు. అందుకే చావు, వృద్ధాప్యం లాంటివి దరిచేరకుండా ఉండాలంటే ఎలా? చావును తప్పించుకోలేమా? అస్సలు వృద్ధాప్యం అనేదే రాకుండా ఎప్పుడూ యవ్వనంగా ఉండలేమా? ఇలాంటి డౌట్లు మీకే కాదు చాలామందికి వస్తాయి. కానీ.. దానికి పరిష్కారం మాత్రం ఇద్దరు జెనెటిక్ ఇంజినీర్లు చూపించారు. కాకపోతే.. మీకు చావు, వృద్ధాప్యం రాకుండా ఉండాలంటే 2045 సంవత్సరం దాకా ఆగాల్సిందే.

ఇద్దరు జెనెటిక్ ఇంజినీర్లు రీసెంట్ గా ఓ పుస్తకాన్ని పబ్లిష్ చేశారు. ఆ పుస్తకం పేరు “ది డెత్ ఆఫ్ డెత్”. దాని ప్రకారం.. 2045 సంవత్సరం తర్వాత అంటే 27 ఏళ్ల తర్వాత మనుషులకు చావు ఉండదు. అంటే ఏ రోగం వచ్చినా.. శరీరానికి సంబంధించి ఎటువంటి సమస్య వచ్చినా చావరు. యాక్సిడెంట్స్ అయితే మాత్రమే చనిపోతారు. అంతేకాదు.. వృద్ధాప్య చాయలే కనిపించవు. వృద్ధాప్యం నుంచి యవ్వనంగా తయారవుతారు.

జోస్ లూయిస్ కొర్డెయిరో, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గణితవేత్త డేవిడ్ వూడ్ ఈ బుక్ ను పబ్లిష్ చేశారు. “నిజానికి చావు అనేది అనివార్యం కాదు.. దాన్ని తప్పించవచ్చు. అయితే.. దానికి పరిష్కార మార్గం ఇంత తొందరగా దొరుకుతుందని మేం ఊహించలేదు. ముసలితనం రావడం అనేది ఓ జబ్బు. ఆ జబ్బును నయం చేస్తే ముసలితనం అనేదే మీ దరికి చేరదు..” అని వీళ్లు తమ బుక్ లో పబ్లిష్ చేశారు.

బార్సిలోనాలో తమ బుక్ ప్రజెంటేషన్ సమయంలో అసలు వృద్ధాప్యాన్ని, చావును ఎలా వాళ్లు ఎలా ఆపగలరో వెల్లడించారు. నానోటెక్నాలజీ ద్వారా వృద్ధాప్యాన్ని దరిచేయనీయకుండా చేయొచ్చన్నారు. డీఎన్ఏ టేల్స్ వల్ల వృద్ధాప్యం వస్తుందని.. దాన్నే క్రోమోజోమ్స్ లో టెలొమెరెస్ అని పిలుస్తారట. అవి క్షీణిస్తేనే వృద్ధాప్యం వస్తుంది. వాటిని పెరిగేలా చేస్తూ ట్రీట్మెంట్ చేస్తే వృద్ధాప్యం దరిచేరదు. ఈ ట్రీట్ మెంట్ వల్ల క్యాన్సర్ ను కూడా క్యూర్ చేయొచ్చు.

కాకపోతే ఈ ట్రీట్ మెంట్ కోసం 2045 సంవత్సరం దాకా ఆగాల్సిందే. అయితే.. అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ట్రీట్ మెంట్ కాస్ట్ ఉండనుందని.. ప్రపంచంలోని అందరు ఈ ట్రీట్ మెంట్ చేసుకునే విధంగా, అందరికీ ప్రయోజనం చేకూరాలన్నదే తమ ప్రయత్నమని వాళ్లు తమ ప్రజెంటేషన్ లో వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news