డిసెంబర్‌ 15 మంగళవారం: రాశి ఫలాలు మరియు పరిహారాలు

-

 డిసెంబర్ -15 – మంగళవారం – మార్గశిరమాసం.

మేషరాశి:ఈరోజు పోటీపరీక్షల్లో విజయం !

వైవాహిక జీవితం సంతోషంగా, ఆనందంగా ఉంటుంది.పోటీపరీక్షల్లో, విద్యా రంగాల్లో ఉన్నవారు విజయం సాధిస్తారు. కొత్త ఆదాయ వనరులను పొందుతారు. స్నేహితుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు గ్రహాల దృష్టి అనుకూలంగా ఉంది. దీనివల్ల మీరు ప్రయోజనాలు పొందుతారు.  ఆరోగ్యాన్ని విస్మరించకండి. వ్యాపారస్తులకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది

పరిహారాలుః శ్రీలక్ష్మీదేవిని ఆరాధించండి.

వృషభరాశి:ఈరోజు ధన లాభం !


ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు విద్య మీద శ్రద్ధ వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు బిజీగా ఉంటారు.  జీవిత భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. గృహ నిర్మాణ సంబంధాలను కొనుగోలు చేస్తారు. ధన లాభం కలుగుతుంది.

పరిహారాలుః శుక్రగ్రహం, గురుగ్రహారాధన చేయండి.

మిథునరాశి:ఈరోజు వ్యాపారంలో లాభం !

ఈరోజు ఉత్సాహంతో ఉంటారు. ఆర్థిక విషయాల్లో మీకు మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో లాభం పొందుతారు. అంతేకాకుండా వ్యాపారం చేస్తున్న వారికి పురోగతి ఉంటుంది. ఈరోజు మీరు ఎంచుకున్న రంగంలో అనుకూల ఫలితాలు. మీరు తక్కువ మాట్లాడటం, ఎక్కువ వినడం మంచిది. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః సుబ్రహ్మణ్యాష్టక పారాయణాన్ని చేసుకోండి, దీనివల్ల ఫలితాలు మరింత అనుకూలంగా వస్తాయి.

కర్కాటకరాశి:ఈరోజు సంతానం వల్ల ఆనందం !

ఈరోజు విలువైన వస్తులు  కొనుగోలు చేస్తారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు ముఖ్య సమాచారం సాయంత్రం అందుతుంది. సంతానం వల్ల ఆనందాన్ని పొందుతారు. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితం సాధారణంగా సాగిపోతుంది.

పరిహారాలుః శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

 

సింహరాశి:ఈరోజు విజయం సాధిస్తారు !

వ్యసనాలకు దూరంగా ఉండండి .  ఇంట్లో వస్తువుల కొనుగోలు కోసం ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు మీరు విజయం సాధిస్తారు. ఈరోజు ఎవరితో తొందరపడి మాట్లాడకండి ఆఫీస్‌లో జాగ్రత్తగా ఉండండి. మీ శత్రువుల నుంచి ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఈరోజు అనుకూల ఫలితాలు లభిస్తాయి. వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్ర పారాయణం చేయండి. అనుకూల ఫలితాలు లభిస్తాయి.

కన్యరాశి:ఈరోజు సానుకూల ఫలితాలు !

సృజనాత్మక రంగాలతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్తగా ఆలోచిస్తే మంచి జరుగుతుంది. ఈ రోజు విద్యార్థులకు అనుకూలమైన రోజు. నూతన ఉద్యోగం కోసం ఆలోచిస్తుంటే ఈ రోజు ప్రయత్నాలను ప్రారంభించండి. ప్రయాణాలకు మంచి అనుకూలమైన రోజు. సాయంత్రం సమయంలో ఆనందంగా గడుపుతారు. ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి.  ఈరోజు మీరు కోపాన్ని నియంత్రించుకోవాలి. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతుంది.

పరిహారాలుః లలితా సహస్రనామ పారాయణం చేసుకోండి.

తులరాశి:ఈరాశి పరిస్థితులు అనుకూలం !

ఈరోజు అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం. ఈరోజు మీరు ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీకు ఈరోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఈరోజు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మీరు కష్టపడి చదవితే ప్రయోజనం పొందుతారు. ఈరోజు ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సంతోషభరితంగా ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మకండి .

పరిహారాలుః శివ అష్టోత్తర నామ పారాయణం  చెప్పుకోతగ్గ సూచన.

వృశ్చికరాశి:ఈరోజు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త !

అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో మీ తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. దేవాలయ నిర్మాణ పనులలో పాలుపంచుకుంటారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. భాగస్వామి నుంచి మద్దతు లభిస్తుంది. ఈరోజు గ్రహచలనాల రీత్యా ఉద్వేగం ఎక్కువగా ఉంటుంది. నిగ్రహంతో పనిచేయాలి. క్రమశిక్షణతో పని చేయడం వల్ల లాభం పొందుతారు.

పరిహారాలుః బాబా దేవాలయం దునిలో కొబ్బరికాయను సమర్పించండి.

 

ధనస్సురాశి:ఈరోజు వృత్తిలో పురోగతి !

ఈరోజు మీరు చేస్తున్న పని ఆగిపోతుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు ఆనందంగా గడుపుతారు. కొంత మంది వేడుకలకు హాజరయ్యే అవకాశముంది. ఈరోజు వృత్తిలో పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. వైవాహికంగా సంతోషం ఉంటుంది.

పరిహారాలుః ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకరరాశి:ఈ రోజు అనుకూలంగా ఉంటుంది !


ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్ కలిగే అవకాశం ఉంది.  ఈరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు అనుకోని శుభవార్త అందుకుంటారు. ఈరోజు బంధువులతో ఆనందంగా ఉంటారు.  వ్యాపారంలో లాభాలు వస్తాయి. దేవాలయ సందర్శనకు అవకాశం ఉంది. వివాహ జీవితంలో ఆనందంగా ఉంటుంది. చేసే పనులలో అదృష్టం బాగా కలసి వస్తుంది.

పరిహారాలుః శ్రీగురుచరిత్ర పారాయణం చేయండి మంచిఫలితం వస్తుంది.

కుంభరాశి:ఈరోజు అనవసర ఖర్చులు !

ఆర్థిక లావాదేవీల విషయంలో నిర్లక్ష్యంగా ఉండవద్దు. ఈ రోజు మీకు బాగా కలిసి వస్తుంది. అనవసర ఖర్చులు కూడా పెరుగుతాయి. స్నేహితులతో సఖ్యతగా ఉంటారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు పిల్లల నుంచి ఆనందం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది.

పరిహారాలుః ఈరోజు గణేష స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి.

మీనరాశి:ఈరోజు అనుకూల వాతావరణం !

అనవసరపు తగాదాలకు దూరంగా ఉండండి. ఈరోజు ఆకస్మిక ఆర్థిక లాభాలు. వ్యాపార అభివృద్ధికి అవకాశాలు ఈరోజు బాగా ఉన్నాయి. ఈరోజు ఆర్థిక విషయాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. వైవాహికంగా బాగుంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు అనుకూల వాతావరణం. కొద్దిగా ప్రయత్నిస్తే విజయాన్ని అందుకుంటారు.

పరిహారాలుః శివాలయంలో ప్రదక్షణలు చేయండి. దీపారాధన చేయండి.

 

  • శ్రీ

 

Read more RELATED
Recommended to you

Exit mobile version