కోయిలమ్మ సీరియల్ హీరో మీద లైంగిక వేధింపుల కేసు

-

రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కోయిలమ్మ సీరియల్ హీరో సమీర్ మీద కేసు నమోదైంది. లైంగికంగా వేధించాడని సమీర్ మీద ఇద్దరు యువతులు ఫిర్యాదు చేశారు. సమీర్ మరో ముగ్గురితో కలిసి తమ మీద దాడికి పాల్పడ్డారని ఇద్దరు యువతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాక తమ వద్ద ఐదు లక్షలు తీసుకున్నాడు అని ఆ యువతులు ఆరోపిస్తున్నారు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే దాడి చేశాడంటూ యువతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కోయిలమ్మ అనే సీరియల్ దాదాపుగా ఇప్పటికి 800 ఎపిసోడ్స్ కి దగ్గర అయ్యింది. మాటీవీ లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఈ సీరియల్ లో హీరోగా నటిస్తున్న సమీర్ తనకు వచ్చిన పాపులారిటీని ఇలా వాడుకుంటున్నాడు అని యువతులు ఆరోపించారు. యువతుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సమీపించి విచారించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news