జేఎన్‌యూలో ఆదివారం జరిగిన హింసాకాండ పై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. విద్యార్ధులపై దుండగులు చేసిన దాడిపై విద్యార్ధి సంఘాలు సహా పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. త్వరలోనే నిందితులు కొందరిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ వివాదం కొనసాగుతున్న నేపధ్యంలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌కు వెళ్ళడం ఇప్పుడు చర్చనీయంశంగా మారింది. విద్యార్ధులపై జరిగిన దాడి ఘటనలను నిరసిస్తూ ఆమె జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తన మద్దతు ప్రకటించారు. దీనిపై బిజెపి నేత తజిందర్ బగ్గా ఆగ్రహం వ్యక్తం చేస్తూ దీపికపై విమర్శలు చేసారు.
దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని ఆయన ఆరోపించారు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేయడం విశేషం. ఇక ఇదిలా ఉంటే జేఎన్‌యూలో పోలీస్ బలగాలు భారీగా మొహరించి అవాంచనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. జేఎన్‌యూలో హింసకు ఏబీవీపీయే కారణమనే ఆరోపణలు వినపడుతున్నాయి.
#WATCH Delhi: Deepika Padukone outside Jawaharlal Nehru University, to support students protesting against #JNUViolence. pic.twitter.com/vS5RNajf1O
— ANI (@ANI) January 7, 2020