అమెరికన్ల భవిష్యత్ కోసం పాటుపడతా : బైడెన్

-

హోరాహోరిగా జరిగిన అమెరికా ఎన్నికల లెక్కింపునకు తెరపడింది. అంచనాలు తప్పాయి. ఒక దశలో ట్రంప్ గెలుపుఖాయం అనుకున్నవారికి ఈ ఎన్నికలు నిరాశనే మిగిల్చాయి. దేశ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికయ్యారు. దేశ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బైడెన్ మొదటిసారిగా ప్రసంగించారు. తమ భవిష్యత్తు కోసం అమెరికా ప్రజలు ఓటేశారని.. వారి నమ్మకాన్నినిలబెడతానని అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ స్పష్టం చేశారు.

joe Biden

ఎన్నికల్లో సహకరించిన ప్రతి ఒక్కరికీ ఈ సందర్భంగా బైడెన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్‌ అద్భుతమైన నాయకురాలని కొనియాడారు. బైడెన్‌ తొలి సారి తన సొంత రాష్ట్రం డెలావెర్‌లో ఏర్పాటు చేసిన డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఉద్వేగంగా ప్రసంగించారు. తన విజయానికి సహకరించిన జీవిత భాగస్వామి జిల్‌ బైడెన్‌ ను ఈ సంధర్భంగా బైడెన్‌ ప్రశంసించారు. ఇక ఎన్నికల్లో ఓడిన ట్రంప్ కు తనకు మధ్య ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. ఎవరైన దేశ భవిష్యత్తు కోసం పాటుపడతామన్నారు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు ఇద్దరం సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకోసం సోమవారం ఒక ప్రత్యేక కార్యదళాన్ని నియమిస్తానని ఆయన తెలిపారు. ఇక ఎన్నికల హామీలను ఖచ్ఛితంగా నెరవేరుస్తానని వాటికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అందులో భాగంగా అన్ని వర్గాల ప్రయోజనాలకు కృషి చేస్తాన్నారు. ఎన్నికల్లో తను సాధించిన విజయం మహిళలందరిదని ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్ అభివర్ణించారు. ఈ పదవికి ఎన్నికైన తొలి మహిళ నేను.. కానీ చివరి మహిళ మాత్రం నేనే కాకుడదని ఆమె ఉద్ఘాటించారు. అధ్యక్ష పదవికి ఎన్నికైన బైడెన్‌ నిరంతరం అమెరికన్ల క్షేమం కోసమే ఆలోచిస్తారని చెప్పారు. తన తల్లి శ్యామలా గోపాలన్‌ అమెరికాకు వచ్చి కన్న కలలను కమల గుర్తు చేసుకున్నారు. అమెరికా చరిత్రలో కొత్త రోజులు ఉండబోతున్నాయని .. ప్రజలు తీర్పును గౌరవిస్తానని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version