సిసోదియాపై సీబీఐ దాడులు సిగ్గుచేటు : అర్వింద్ కేజ్రీవాల్

-

దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై సీబీఐ దాడులు జరగడంపై సీఎం కేజ్రీవాల్ స్పందించారు. సీబీఐ దాడులను ఖండించారు. రాజకీయ కారణాలతో సిసోదియాను కేంద్రం వేధిస్తోందని ఆరోపించారు.

దిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను సౌకర్యాలను మెరుగుపరిచిన సిసోదియా.. భారతరత్న పురస్కారానికి అర్హుడని కేజ్రీవాల్‌ కొనియాడారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేజ్రీవాల్‌.. దిల్లీ విద్యా నమూనాను న్యూయార్క్ టైమ్స్ ప్రశంసించిన విషయాన్ని గుర్తు చేశారు.

70 ఏళ్లలో ఏ రాజకీయ పార్టీ చేయలేని అభివృద్ధిని ఐదేళ్లలో చేసి అద్భుతం సృష్టించిన వ్యక్తిపై సీబీఐ దాడులు సిగ్గుచేటు కాదా అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. భారతరత్న ఇవ్వాల్సిన వ్యక్తిపై ఇలాండి దాడులు ఏంటని నిలదీశారు. మనీశ్​ సిసోదియాను అరెస్ట్ చేయవచ్చని, తనను కూడా అరెస్ట్‌ చేయవచ్చన్న కేజ్రీవాల్‌.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌లో ఆప్ అధికారంలోకి వస్తే ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news