రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తన ఉనికిని బలోపేతం చేసుకునే దిశగా కసరత్తులు చేస్తుంది. కాగా, రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి , ఆప్ వ్యవస్థాపకుడు అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాంనగరి అయోధ్యను సందర్శించనున్నారు. వీళ్ల పర్యటన చాలా ముఖ్యమైనది. ఇక్కడి రామాలయాన్ని ఆయన సందర్శిస్తారు.
ఇక ఢిల్లీ సీఎం కేజీవాల్ రేపు అయోధ్యను కుటుంబ సమేతంగా సందర్శించనున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందలేదని, తర్వాత అయోధ్య రాముడిని దర్శించుకుంటానని గతంలో ఆయన చెప్పారు.బాల రాముని ప్రతిష్ఠాపన తర్వాత రామమందిరాన్ని సందర్శించబోతున్న మొదటి ప్రతిపక్ష నాయకుడు కేజ్రీవాల్. ఈ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ప్రతిపక్ష పార్టీ నాయకులను ఆహ్వానించినప్పటికీ కూడా వారు హాజరు కాలేదు. కాగా దేశ నలుమూలల నుంచి భక్తులు వస్తుండటంతో ఆలయంలో రద్దీ నెలకొంటోంది.