ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇంగ్లండ్ తో జరగబోయే మూడో టెస్టు కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై నుంచి రాజ్కోట్ బయల్దేరి వెళ్లారు. మిగతా ఆటగాళ్లు రేపు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా మరో రెండు రోజుల్లో అబుదాబి నుంచి ఇండియాకి తిరిగిరానున్నట్లు సమాచారం. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇప్పటివరకు జరిగిన రెండు టెస్టులలో ఇరుజట్లు చెరొక విజయం సాధించడంతో సిరీస్ 1-1 తో సమం అయింది.ఇక మూడో టెస్ట్ భారత్ ,ఇంగ్లాండ్ మధ్య ఈనెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మొదలుకానుంది.
వైజాగ్ వేదికగా జరిగిన రెండవ టెస్ట్ లో ఇంగ్లాండ్ ను 292 పరుగులకే ఆలౌట్ చేసి టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక మూడవ టెస్టుకు టీమిండియా యువ బ్యాటర్ శ్రేయాస్ పై సెలెక్టరులు వేటు వేశారు. ఈ మ్యాచ్లో బుమ్రా ఆడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక కింగ్ విరాట్ కోహ్లీ ఈ టెస్ట్ మ్యాచ్ తో పాటు మిగతా టెస్టులకు కూడా డౌటే అని వార్తలు వినిపిస్తున్నాయి.