కరోనా ఫస్ట్ వేవ్ ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న సమయంలో సెకండ్ వేవ్ అలజడి మెల్లగా మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రిటన్ లో మళ్ళీ లాక్డౌన్ విధించారు. ఐతే భారతదేశానికి సెకండ్ వేవ్ ఇంకా రాకముందే ఢిల్లీలో థర్డ్ వేవ్ నడుస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కొన్ని రోజులుగా పరిస్థితి చూసుకుంటే కరోనా ఉధృతి తీవ్రంగా ఉందని, ప్రస్తుతం ఢిల్లీలో థర్డ్ వేవ్ నడుస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.
ఆదివారం నుండి సోమవారం వరకు కరోనా కేసులు చూసుకుంటే 5వేలు దాటాయి. అదే మంగళవారానికి వచ్చే సరికి ఆ సంఖ్య ఆరువేలకి దాటింది. ఇంత త్వరగా పెరుగుకుంటూ పోతుంటే థర్డ్ వేవ్ వచ్చినట్టే అని కేజ్రీవాల్ స్పష్టం చేసారు. ఐతే కరోనా విస్తరిస్తున్నప్పటికీ భయాందోళనలకి గురి కావాల్సిన పనిలేదని, మహమ్మారి నుండి కాపాడడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, కావాల్సినన్ని బెడ్లు, ఇతర సామాగ్రి అందబాటులో ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందకుండా కరోనా జాగ్రత్తలు పాటించడం మంచిదని కోరాడు.