భారత క్రికెటర్ శిఖర్ ధావన్ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేయొద్దని అతడి భార్య ఆయేషాకు ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శిఖర్ ధావన్ కు వ్యతిరేకంగా అవమానకరమైన తప్పుడు ప్రచారాలు చేయటం సరికాదని న్యాయమూర్తి హరీష్ కుమార్ ఆదేశించారు.
సమాజంలో పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకోవడం చాలా కష్టం అన్న ఆయన ధావన్ పరువుకు భంగం కలిగే వాక్యాలు చేయడం సరికాదని అన్నారు. కాగా, ప్రస్తుతం శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయేషా తన ప్రతిష్టను దెబ్బతీసేలా వాక్యాలు చేస్తోందని ధావన్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయేషాను అలా చేయొద్దని ఆదేశించింది. కాగా, శిఖర్ ధావన్ ఆస్ట్రేలియా కు చెందిన ఆయేషా ముఖర్జీని 2012లో వివాహం చేసుకున్నాడు.