యోగి సర్కార్ మిషన్ శక్తి.. మహిళల కోసమే..!

-

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ అధికారంలోకి వచ్చినప్పుడు నుంచి ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా నేరాలను అరికట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న యూపీ సర్కార్ ఏకంగా రౌడీయిజం పై మతకలహాల పై ఉక్కుపాదం మోపి ఎక్కడికక్కడ నేరాలను అదుపు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు దాడుల ఘటనలు కూడా వెలుగులోకి వస్తు ప్రభుత్వం తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది యూపీ ప్రభుత్వం.

మహిళల భద్రత కోసం యోగి ఆదిత్యనాథ్ సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ రక్షణ గౌరవం కోసం మిషన్ శక్తి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా ఫిర్యాదు చేసేందుకు పదిహేను వందల ముప్పై ఐదు పోలీస్ స్టేషన్లో ప్రత్యేక గదులు ఏర్పాటు చేస్తామంటూ యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇక ప్రతి పోలీస్ స్టేషన్ లోని మహిళా కానిస్టేబుళ్లు మహిళల నుంచి ఫిర్యాదులు తీసుకుంటారు అంటూ తెలిపిన యోగి ఆదిత్యనాథ్.. అత్యాచారాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news