‘నిర్భయ’ దోషులకు ఉరిశిక్ష అమలు నిలుపుదల.. ఎందుకంటే..?

-

నిర్భయ దోషుల ఉరితీత అమలులో జాప్యం తప్పదని తెలుస్తోంది. ఈ నెల 22న నలుగురు దోషులను ఉరి తీయాలని ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు ఇప్పటికే డెత్ వారెంట్ జారీ చేసింది. దాంతో దోషులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా అక్కడ వారికి వ్యతిరేకత ఎదురైంది. ఆపై దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ రాష్ట్రపతిని, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ను వేర్వేరు పిటిషన్ల ద్వారా క్షమాభిక్ష కోరాడు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ పిటిషన్ ను తిరస్కరించారు. అంతేకాదు, ఆ పిటిషన్ ను తోసిపుచ్చాలంటూ కేంద్ర హోంశాఖకు కూడా సిఫారసు చేశారు.

నిర్భయ దోషుల్లో ఒకడైన ముఖేశ్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండటంతో ఈ కేసులోని నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలును ఢిల్లీ కోర్టు గురువారం నిలిపేసింది. తీస్ హజారీ కోర్టు జడ్జి గురువారం మాట్లాడుతూ డెత్ వారంట్ జారీకి తన ఆర్డర్‌ను రివ్యూ చేయబోనని చెప్పారు. క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందువల్ల డెత్ వారంట్‌ను అమలు చేయడాన్ని నిలిపేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22న వారిని ఉరి తీయబోమని పేర్కొంటూ, ఓ నివేదికను జైలు అధికారులు తనకు సమర్పించాలని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news