ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సంబరాలు ఒకపక్క ప్రజలు చేసుకుంటే మరోపక్క బిజెపి జనసేన పార్టీ నాయకులు పొత్తుకోసం మరోపక్క కనుమ పండుగ రోజు బెజవాడ వేదికగా భేటీ అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ముందు నుండి జనసేన పార్టీకి మిత్రపక్షంగా ఉంటూ లెఫ్ట్ పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరాడు అని లెఫ్ట్ పార్టీ నేతలు కామెంట్లు చేస్తున్నారు.
జనసేన తో ఉన్న మిత్రపక్ష బంధాన్ని బీజేపీ- జనసేన పార్టీ పొత్తు రోజునే తెగతెంపులు చేసుకోవడానికి రెడీ అయిపోయారు లెఫ్ట్ పార్టీ నేతలు. దీంతో ఈ వార్త పవన్ దాక వెళ్లడంతో షాక్ అయినట్లు సమాచారం. ముఖ్యంగా బిజెపి మరియు వామపక్ష పార్టీల భావజాలాలు చాలా వ్యతిరేకంగా ఉండటంతో పవన్ కళ్యాణ్ కూడా వామపక్ష పార్టీల స్నేహ హస్తాన్ని లైట్ గా తీసుకున్నట్లు సమాచారం.
అంతేకాకుండా గత ఎన్నికలలో లెఫ్ట్ పార్టీ నేతలతో కలసి పోటీ చేసిన రాష్ట్రంలో పెద్దగా ఓటింగ్ శాతం రాకపోవడంతో భవిష్యత్తులో బీజేపీ పార్టీ తో కలసి ముందుకు వెళ్లాలని బలమైన ఆలోచనతో పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వ్యవహరిస్తున్నట్లు సమాచారం. రాబోయే 2024 ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ రెడీ అవుతున్నట్లు అందుకోసం ఇప్పటి నుండే రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుండి అందుతున్న సమాచారం.