ఇక టోకెన్ ప‌ద్ధ‌తిలో మ‌ద్యం అమ్మ‌కాలు..!

-

దాదాపుగా 40 రోజుల లాక్‌డౌన్ అనంత‌రం మ‌ద్యం షాపుల‌ను ఓపెన్ చేసేందుకు అనుమ‌తులు ఇవ్వ‌డంతో మ‌ద్యం ప్రియులు ఒక్క‌సారిగా కొనుగోళ్ల‌కు ఎగ‌బ‌డ్డారు. దీంతో అనేక షాపుల వ‌ద్ద భౌతిక దూరం నిబంధ‌న‌ను పాటించ‌లేదు. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం య‌థాప్ర‌కారం మ‌ద్యం ప్రియులు లైన్ల‌లో నిల‌బ‌డి మ‌రీ మ‌ద్యం కొనుగోలు చేశారు. కానీ ఢిల్లీలో మాత్రం ఇప్ప‌టికీ మందు బాబులు మ‌ద్యం కోసం షాపుల వ‌ద్ద ఎగ‌బ‌డుతున్నారు. అయితే దీన్ని నివారించేందుకు ఢిల్లీ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. ఇక‌పై అక్క‌డ టోకెన్ ప‌ద్ధ‌తిలో మ‌ద్యం విక్ర‌యాలు జ‌ర‌పనున్నారు.

ఢిల్లీలో మ‌ద్యం కొనాల‌నుకునే వారు ముందుగా ఆన్‌లైన్‌లో టోకెన్ తీసుకోవాలి. ఆ టోకెన్‌కు నిర్ద‌ష్ట‌మైన రోజున‌.. నిర్దిష్ట‌మైన స‌మ‌యంలో అనుమ‌తి ఉంటుంది. ఆ స‌మ‌యంలోనే మందుబాబులు షాపుల‌కు వెళ్లి మ‌ద్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ప్ర‌వ‌ర్తిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారు. ఈ క్రమంలో మ‌ద్యం ప్రియులు ఇక‌పై అక్క‌డ టోకెన్ విధానంలోనే మ‌ద్యం కొనాల్సి ఉంటుంది.

కాగా ఢిల్లీలో మొత్తం 864 లిక్క‌ర్ షాపులు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 172 షాపులను మాత్ర‌మే ఓపెన్ చేశారు. దీనివ‌ల్లే అక్క‌డ మ‌ద్యం ప్రియులు షాపుల వ‌ద్ద పెద్ద ఎత్తున గుమి గూడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version