వాహనదారులకు కేజ్రీవాల్ సర్కార్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో… దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని అరికట్టే అందుకు పొల్యూషన్ సర్టిఫికెట్ కలిగి ఉండడం తప్పనిసరి చేసింది. ఈ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోసేలా కొత్త నిబంధనలను తీసుకురావాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన సలహాలు, సూచనలతో పాటు అభ్యంతరాలు ఉంటే తెలపాలని ప్రజలను కోరింది సర్కార్.
ఢిల్లీలో కాలుష్యాన్ని విడుదల చేసే వాహనాలను తిరగకుండా ఢిల్లీ ప్రజలకు స్వచ్ఛమైన గాలిని ఆస్వాదించేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆ రాష్ట్ర పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. పౌరులకు స్వచ్ఛమైన గాలిని అందించేందుకు.. కేజ్రీవాల్ సర్కార్ కట్టుబడి ఉందని అన్నారు. అయితే ఈ సర్టిఫికెట్లను ప్రతిసారి చూడాలంటే వాహనదారులు తో పాటు పెట్రోల్ పంపు యజమానులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుంది. ఇలా పెద్ద పెద్ద క్యూ లేకుండా ఉండేలా ఈ పాలసీని సమర్థవంతంగా అమలు చేసేందుకు వ్యూహా రచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.